: హర్యానాలోని హిసార్ లో ఘోర ప్రమాదం

హర్యానా రాష్ట్రంలోని హిసార్ లో దారుణ ప్రమాదం జరిగింది. కాపలాలేని రైల్వేక్రాసింగ్ వద్ద రైలు ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో వాహనంలో ఉన్న 12 మంది మృతి చెందారని, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో వాహన డ్రైవర్ కూడా ఉన్నట్టు వెల్లడించారు. బాధితులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని రైల్వే క్రాసింగ్ వద్ద దురిసిర్సా ప్యాసింజర్ బలంగా ఢీకొట్టింది. బలక్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబం ఓ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు.

More Telugu News