: గణతంత్ర వేడుకల్లో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

నల్గొండ జిల్లాలోని గోరెన్ కల్ పల్లి పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న ఎర్రమాడ నరేంద్ర రెడ్డి(53) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురయ్యాడు. ఏం జరిగిందో అక్కడివారు తెలుసుకునేలోగానే కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. దాంతో, పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాథమిక పాఠశాలలో తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో ఇటువంటి ఘటన జరగడంతో గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News