: తిరుమల తిరుపతి దేవస్థానం శకటానికి ప్రథమ బహుమతి

ఆంధ్రప్రదేశ్‌లో 66వ గణతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన శకటాల ప్రదర్శనలో తిరుమల తిరుపతి దేవస్థాన శకటానికి ప్రథమ బహుమతి లభించింది. ఏడు కొండలు, గరుడ పక్షి, అన్నమయ్య, వెంగమాంబ, భక్తులు తదితర అలంకారాలతో తయారైన శకటం విశేషంగా ఆకట్టుకొంది. ఈ ప్రదర్శనలో వ్యవసాయ, నీటిపారుదల, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పౌరసరఫరాలు, జాతీయ ఆహార భద్రత సహా పలు శకటాలు అలరించాయి. వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, సాగునీటి శాఖ శకటం తృతీయ బహుమతిని అందుకున్నాయి. ఆయా శాఖలకు సంబంధించిన కమిషనర్లు గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.

More Telugu News