: ఆసీస్-ఇండియా మ్యాచ్ కి వర్షం అడ్డంకి

ముక్కోణపు వన్ డే సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరగాల్సిన ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ కి వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. నేటి ఉదయం భారీ వర్షం పడడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ లలో గెలిచి ఫైనల్ కు చేరగా, ఈ మ్యాచ్ లో సత్తా చాటి బోనస్ పాయింట్ తో తలపడాలని భారత్ కోరుకుంటోంది. ప్రస్తుతం సిడ్నీ గ్రౌండ్ లో పిచ్ పై కవర్లు కప్పి ఉంచారు. సన్నగా వర్షం పడుతోంది.

More Telugu News