: యువకుడి తలతో కుక్కల బంతాట... దొరకని మృతదేహం... ఆదిలాబాద్ జిల్లాలో కలకలం

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కుక్కలు ఓ యువకుడి తల కోసం యుద్ధం చేస్తూ కనిపించడంతో కలకలం రేగింది. నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ వ్యక్తి గాంధీనగర్ మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా కుక్కలు ఓ యువకుడి తల కోసం పోటీ పడుతూ కనిపించాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో, వారు ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కోసం జాగిలాలతో గాలించారు. అవి బుగ్గ అటవీ ప్రాంతం వైపు పరుగెత్తినా ఆచూకీ దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News