: ఆ నిబంధన తొలగింది... అందువల్లే 'అణుబంధం' కుదిరింది!

అమెరికాతో ఆరేళ్ల క్రితమే అణు ఒప్పందానికి బీజం పడింది. కానీ సాకారం కాలేదు. యూపీఏ ప్రభుత్వం సాధించలేని దాన్ని మోదీ సాధించి చూపారు. ఇందుకు కారణం కీలకమైన ఒక నిబంధన తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా అంగీకరించడమే. ఆయనను ఒప్పించడంలో మోదీ చేసిన కృషి అమోఘమైంది. వాస్తవానికి అమెరికా నుంచి అణు సహకారం పొందితే, ఆ సాంకేతికతను ఎలా వినియోగిస్తున్నారు? అన్న దానిపై అమెరికా నిఘా పెడుతుంది. దీనికి ససేమిరా అన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఆ నిబంధన తొలగిస్తేనే అమెరికాతో డీల్ కుదుర్చుకుంటామని స్పష్టం చేసింది. అప్పట్లో ఈ నిబంధన తొలగించేందుకు అంగీకరించని అమెరికా ఇప్పుడు దిగివచ్చింది. ఎందుకంటే, అమెరికా కాదంటే అణు సహకారం అందివ్వడానికి రష్యా, జపాన్ తదితర దేశాలు రెడీగా వున్నాయి కాబట్టి. ఇండియా వంటి శరవేగంగా అభివృద్ది చెందుతున్న దేశంతో ఒప్పందం అమెరికాకు మేలు చేకూర్చుతుందని ఒబామా నమ్మబట్టే ఇప్పటికైనా డీల్ కుదిరింది.

More Telugu News