: మోహన్ బాబు ఇంట మోగనున్న పెళ్లి బాజాలు

సినీ నటుడు మోహన్ బాబు ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. సినీ నటుడు మంచు మనోజ్ పెళ్లి కొడుకు కానున్నారు. హైదరాబాదుకు చెందిన సత్యనారాయణ, ప్రవీణల కుమార్తె ప్రణతిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహమాడనున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. కాగా, ప్రణతి మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య వెరోనికకు స్నేహితురాలు కావడం విశేషం. దీంతో వదిన ఆశీస్సులతో మనోజ్ పెళ్లికొడుకు కానున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొత్త ఏడాది మనోజ్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్టు సమాచారం.

More Telugu News