: తెలంగాణ మంత్రి వర్గ మార్పులివే

తెలంగాణ మంత్రివర్గం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైంది. రాజ్ భవన్ లో కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం ఆత్మీయ పలకరింపులు ముగిసిన తరువాత, కేబినెట్ మొత్తం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లింది. అక్కడ సీఎం కేసీఆర్ మంత్రుల శాఖల్లో కీలక మార్పులు చేశారు. తాజా మంత్రి కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు. లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు.

More Telugu News