: తిరుపతి ఎన్నిక ఏకగ్రీవం కాదు... అభ్యర్థిని బరిలోకి దించిన కాంగ్రెస్
ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్న తిరుపతి అసెంబ్లీ ఎన్నిక మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా డ్వాక్రా సంఘాల నేత ఆర్. శ్రీదేవి పేరును ప్రకటించింది. అనారోగ్యంతో ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ స్థానంలో ఆయన సతీమణి సుగుణమ్మ పేరును ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ విజ్ఞప్తికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి తమ అభ్యర్థిని నిలపబోమని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎదురు తిరిగింది. అభ్యర్థి ప్రకటన వెనుక కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.