: ఆ రోజు పబ్ లో నేను తాగలేదు: స్పష్టం చేసిన నటి అంజలి

మొన్న హైదరాబాదులోని ఒక పబ్ లో తాను మద్యం తాగి గొడవ చేసినట్టు వచ్చిన వార్తలను సినీనటి అంజలి తీవ్రంగా ఖండించారు. ఆరోజు తాను స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల నిమిత్తం రాత్రి 9 గంటల సమయంలో పబ్ కు వెళ్లానని, ఒక అరగంట మాత్రమే గడిపి వచ్చేశానని ఆమె స్పష్టం చేశారు. అడిగిన విధంగా మీడియాకు ఫోజులు ఇవ్వనందునే తనపై కొందరు ఆరోపణలు ప్రచారం చేశారని ఆరోపించారు. తాను ఆ రోజు తాగలేదని, తన పక్కన ఎవరూ బాయ్ ఫ్రెండ్ లేడని తెలిపారు. సాక్ష్యం కోసం సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని ఆమె కోరారు. కాగా, శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి, పబ్ నిర్వాహకులను నోటికొచ్చినట్టుగా తిట్టిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News