: పసికందును అపహరిస్తూ దొరికిపోయిన మహిళ

గుంటూరు జీజీహెచ్‌ లో పసికందు అపహరణ యత్నం భగ్నమైంది. నాలుగు రోజుల క్రితం జన్మించిన పసికందును అపహరించేందుకు రహిమూన్ అనే మహిళ ప్రయత్నించింది. ఆ పాపను తీసుకుని బయటకు బయలుదేరింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు తమ పాప కనిపించడం లేదని గగ్గోలు పెట్టారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది, బంధువులు వెతకగా, నిందితురాలు దొరికింది. ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తను బిడ్డను పెంచుకోవాలని తీసుకువెళ్లినట్టు పోలీసుల విచారణలో రహిమూన్ చెప్పింది. గతంలో జరిగిన చిన్నారుల కిడ్నాప్ వ్యవహారాల్లో రహిమూన్ ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News