: ఊరూరా 'చదువులమ్మ' దర్శనానికి పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి ఆలయాలు భక్తుల ప్రత్యేక పూజలతో కిటకిటలాడుతున్నాయి. ఈ దఫా వసంత పంచమి రెండు రోజులు రావడంతో నేడు కూడా చదువుల తల్లి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. జ్ఞానసరస్వతీదేవి కొలువైన బాసరకు నిన్న సుమారు 50 వేల మంది భక్తులు రాగా, 2,128 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జంటనగరాల పరిధిలో వున్న సరస్వతి దేవి ఆలయాల్లో 20 వేలమంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిగినట్టు సమాచారం.

More Telugu News