: క్రికెట్ ఆడనున్న స్పాట్ ఫిక్సర్ మహ్మాద్ అమీర్

స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. 2010లో లార్డ్స్ టెస్టును స్పాట్ ఫిక్స్ చేసినందుకు మహ్మద్ అమీర్ ఆరునెలల జైలు శిక్ష అనుభవించాడు. కాగా, బౌలర్ గా సంచలన గణాంకాలు నమోదు చేసిన అమీర్ ను తాజా వరల్డ్ కప్ లో ఆడించేందుకు పాక్ సన్నాహాలు చేసింది. పాక్ విజ్ఞప్తి మేరకు ఐసీసీ అనుమతిచ్చినప్పటికీ, నిబంధనల కారణంగా అతను వరల్డ్ కప్ లో ఆడే అవకాశం లేకపోవడంతో, వచ్చే నెల నుంచి దేశవాళీల్లో రంగప్రవేశం చేయనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అతనిపై విధించిన నిషేధం ముగియనుంది.

More Telugu News