: నవ్వుల రేడు ఎంఎస్ అంతిమయాత్ర ప్రారంభం
ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాదులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో పలువురు సినీ నటులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక ఆయన చివరి చూపుకోసం సన్నిహితులు, ఇతరులు భారీగా తరలివస్తున్నారు. యాత్ర ముగిసిన వెంటనే ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకుముందు నటుడు మహేష్ బాబు ఎంఎస్ కు చివరిసారిగా నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఎంఎస్ కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే.