: విద్యుత్ షాక్... వెనువెంటనే గ్యాస్ సిలిండర్ల పేలుడు... పరుగులు పెట్టిన ముదినేపల్లి వాసులు
కృష్ణా జిల్లాలో విద్యుత్ షాక్, వెనువెంటనే గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు జరిగాయి. జిల్లాలోని ముదినేపల్లిలో నేటి ఉదయం విద్యుత్ షాక్ తో మూడు ఇళ్లకు నిప్పంటుకుంది. ఈ క్రమంలో సదరు ఇళ్లల్లోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే వెంటవెంటనే జరిగిన రెండు ప్రమాదాలలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ధీంతో రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబాలు చెప్పాయి.