: హైదరాబాదులో మూగబోయిన ఎయిర్ టెల్ మొబైళ్లు!

ఎయిర్ టెల్ సేవలు హైదరాబాదు నగరంలో స్తంభించాయి. నేటి ఉదయం నుంచి ఎయిర్ టెల్ సేవల్లో నెలకొన్న అంతరాయం వల్ల దాదాపు 3 గంటలుగా ఎయిర్ టెల్ వినియోగదారుల సెల్ ఫోన్లు మూగబోయాయి. సమాచారం అందుకున్న ఎయిర్ టెల్ సంస్థ వెనువెంటనే రంగంలోకి దిగింది. సేవల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అయితే ఇందుకు మరో గంట సమయం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సేవల అంతరాయానికి గల కారణాలు తెలియరాలేదు.

More Telugu News