: టి.హబ్ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

ప్రతిష్ఠాత్మక టి.హబ్ కు టీఎస్ ఐటీ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టి.హబ్ లో మొదటి దశలో 450 కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పారు. జూన్ 2 కల్లా మొదటి దశ పూర్తవుతుందని తెలిపారు. దీంతో, 3 వేల మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని అన్నారు. 2018 నాటికి రెండో దశను పూర్తి చేస్తామని చెప్పారు. టి.హబ్ ను కొత్త ఆలోచనలకు వేదికగా తీర్చిదిద్దుతామని అన్నారు. యువతకు వచ్చే కొత్త ఆలోచనలకు టి.హబ్ వేదికవుతుందని తెలిపారు. వచ్చే కేబినెట్ లో ఐటీ పాలసీ డ్రాఫ్ట్ ను తీసుకువస్తామని చెప్పారు.

More Telugu News