: సమయం వచ్చినప్పుడు కిరణ్ బేడీ, కేజ్రీవాల్ నాకు మద్దతిస్తారని ఆశిస్తున్నా: అన్నా హజారే

'జన్ లోక్ పాల్' బిల్లును సాధించడమే తన లక్ష్యమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి స్పష్టం చేశారు. లోక్ పాల్ పై తానొక్కడినే పోరాడతానని అన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్, బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ సమయం వచ్చినప్పుడు తనకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించనని హజారే అన్నారు. రాజకీయం ఓ మురికికూపమని ఇటీవలే ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు, బీజేపీలో చేరుతున్నట్టు కిరణ్ బేడీ తనకు చెప్పలేదని స్పష్టం చేశారు.

More Telugu News