: శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన లూక్ రోంచీ

డునెడిన్ లో శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఇలియట్ (104 నాటౌట్) తో కలసి లూక్ రోంచి జట్టు స్కోరును పరుగులెత్తించాడు. కేవలం 99 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 170 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. రోంచి విధ్యంసకర బ్యాటింగుతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. మరోవైపు, బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. 18.2 ఓవర్లలో 93 పరుగులు చేసింది. ఒపెనర్లు తిరిమన్నే (45), దిల్షాన్ (40) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

More Telugu News