: అవినీతి ముద్ర వల్లే భారత్ చాలా కాలంగా ఇబ్బందులు పడుతోంది: అరుణ్ జైట్లీ

నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కూడా అవినీతి కొనసాగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ముద్ర ఉండటం వల్లే చాలా కాలంగా భారత్ ఇబ్బందులు పడుతోందని అన్నారు. అవినీతిని ఏమాత్రం సహించమని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అవినీతిని రూపు మాపడానికి అవసరమైనే కొత్త చట్టాలను కూడా తీసుకొస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. దేశ ప్రతిష్ఠను అవినీతి మంటగలుపుతుందని అన్నారు. అవినీతిని అంతం చేసే విషయంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు.

More Telugu News