: ఐపీఎల్ బెట్టింగ్ తో శ్రీనివాసన్ అల్లుడికి సంబంధం ఉంది: సుప్రీం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై ఫ్రాంఛైజీకి ప్రిన్సిపల్ గా వ్యవహరించిన గురునాథ్ మెయ్యప్పన్ కు ఐపీఎల్ బెట్టింగ్ తో సంబంధం ఉందని తెలిపింది. గురునాథ్, రాజ్ కుంద్రా(శిల్పా శెట్టి భర్త)లు ఫ్రాంఛైజీల సహ యజమానులేనని వెల్లడించింది. దాంతో వారిద్దరినీ ఈ కేసులో దోషులుగా కోర్టు తేల్చింది. ఇక ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనివాసన్ భవితవ్యం కూడా కాసేపట్లో తేలనుంది. దాదాపు 17 నెలల తరువాత ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో 130 పేజీలతో తీర్పు వెలువడటం విశేషం.