: గాంధీ ఆసుపత్రిలో కేంద్ర వైద్య బృందం

తెలంగాణను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వైరల్ పై అంచనా వేసేందుకు కేంద్ర వైద్య బృందం ఈరోజు హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని పరిశీలించింది. అక్కడి ఐసోలేషన్ వార్డును క్షణ్ణంగా తనిఖీలు చేసింది. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించింది. అయితే గాంధీలో పరిశుభ్రతపై వైద్య బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక్కడే ఇలా ఉంటే జిల్లాల్లో ఆసుపత్రుల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాక స్వైన్ ఫ్లూతో చనిపోయినవారి వివరాలు సరిగా లేకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని విషయాలపై సమీక్ష చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు బృంద సభ్యులు తెలిపారు. జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్, అదనపు డైరెక్టర్ శశిరేఖ, సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమ అధికారి డాక్టర్ ప్రదీప్ ఖస్నోబిస్ లు ఈ బృందంలో ఉన్నారు. వారితో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా గాంధీలో పర్యటించారు.

More Telugu News