: స్వైన్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి... మంత్రి కామినేనికి చంద్రబాబు ఫోన్
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు సూచించారు. ఈ మేరకు ఆయన దావోస్ నుంచి కామినేనికి ఫోన్ చేశారు. వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని చంద్రబాబు చెప్పారు.
మంత్రి కామినేని మాట్లాడుతూ, ఏపీలో స్వైన్ ఫ్లూ ప్రభావం తక్కువేనని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రతి జిల్లా ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వార్డు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు.