: తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాప్తిపై కేంద్ర మంత్రి జేపీ నద్దా సమీక్ష

తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాప్తిపై కేంద్ర మంత్రి జేపీ నద్దా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి రాజయ్య తదితరులతో ఆయన సమీక్ష చేపట్టారు. ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి బృందాన్ని తెలంగాణకు పంపుతున్నట్టు తెలిపారు. ఈ బృందం అన్ని అంశాలను పరిశీలించి అంచనా వేస్తుందని నద్దా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

More Telugu News