: మాతృభాషకు ఆంగ్లభాష ప్రత్యామ్నాయం కాదు: యూపీ గవర్నర్

మాతృభాషకు ఆంగ్లభాష ప్రత్యామ్నాయం కాదని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ స్పష్టం చేశారు. అలహాబాద్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంగ్లం ప్రయోజనకరమైన భాష అనడంలో సందేహం లేదని అన్నారు. అయితే, ఆంగ్లభాష మాతృభాషకు ప్రత్యామ్నాయం మాత్రం కాజాలదని ఆయన తెలిపారు. ఆంగ్లం నేర్చుకోవడంలో తప్పులేదన్న ఆయన, మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

More Telugu News