: స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం కాదు... మాస్క్ లు అవసరం లేదు: ప్రైవేటు వైద్యులు

స్వైన్ ఫ్లూ ప్రాణాంతకమైన వ్యాధి కాదని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన సందర్భంగా వారు మాట్లాడుతూ, 2009, 2010లలో కూడా స్వైన్ ఫ్లూ వచ్చిందని అన్నారు. స్వైన్ ఫ్లూ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉందని అన్నారు. కాకుంటే అక్కడ డయాగ్నస్ కావడం లేదని వారు చెప్పారు. శీతాకాలంలో స్వైన్ ఫ్లూ ప్రతి ఏడూ వస్తుందని, మాస్కులు కూడా కట్టుకోనవసరం లేదని వారు స్పష్టం చేశారు. మందులు కూడా తెప్పించుకోవాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కేవలం మీడియా ప్రసారం చేస్తున్న వార్తలే తప్ప స్వైన్ ఫ్లూ లేదని వారు వివరించారు. స్వైన్ ఫ్లూతో ఎవరూ మరణించడం లేదని, అసలు ఏదో ఒక రోగం కారణంగా మరణించరని, పలు రోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మాత్రమే మృతి చెందుతారని వారు చెప్పారు. ముఖ్యమంత్రి కనుక ఆయన ఆదుర్దా చూపించారని వారు వెల్లడించారు. స్ల్వైన్ ఫ్లూ సోకితే వేక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వారు వివరించారు. డాక్టర్ల సలహాతోనే వేక్సిన్ తీసుకోవాలని వారు చెప్పారు.

More Telugu News