: కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ నామినేషన్

ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధానిలోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలో దిగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ దాఖలు నేడు చివరి రోజు. ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News