: మరో 20 రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్

తెలంగాణలో స్వైన్ ఫ్లూ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తుండటంపై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి ప్రబలుతున్నా స్తబ్దుగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడిన కేసీఆర్... పరిస్థితిని వివరించారు. మరో 20 రోజుల పాటు రాష్ట్రంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని... కావున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా, స్వైన్ ఫ్లూ తీవ్రతపై కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.

More Telugu News