: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం... నేడు కేజ్రీ, బేడీల నామినేషన్లు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల జోరు కొనసాగనుంది. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధులుగా బరిలోకి దిగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కూడా నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి కేజ్రీ బరిలోకి దిగుతుండగా, కృష్ణా నగర్ నుంచి కిరణ్ బేడీ పోటీ చేస్తున్నారు. నిన్నటికి నిన్న నగరంలో 7 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించిన కేజ్రీవాల్ తన సత్తా చాటారు. తాజాగా ఆ ర్యాలీకి దీటుగా ఓ భారీ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది. అయితే నేటి బేడీ నామినేషన్ నే ఇందుకు వినియోగించుకుంటుందా? లేక మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందా? అన్న విషయం తేలాల్సి ఉంది.

More Telugu News