: భారత మామిడి దిగుమతులపై ఐరోపా యూనియన్ నిషేధం ఎత్తివేత

దేశంలోని మామిడి రైతులకు శుభవార్త. భారతీయ మామిడిపండ్ల దిగుమతిపై ఐరోపా సమాఖ్య నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో దేశీయ మామిడి రైతులకు మంచి రోజులు రానున్నాయి. భారత్ లో మామిడి పండించే విధానంలో ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించడం, పండ్ల నాణ్యతకు సంబంధించి ధ్రువీకరణ వ్యవస్థ మెరుగవ్వడం ఐరోపా యూనియన్ నిర్ణయానికి కారణం. ఈ నేపథ్యంలో, మామిడి పళ్ల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇప్పుడు దీనికి అధికారికంగా ఆమోదం తెలపాల్సి ఉంది. కాగా, భారత కూరగాయల దిగుమతిపై నిషేధం పట్ల సమీక్ష చేపట్టిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని యూరోపియన్ యూనియన్ పేర్కొంది.

More Telugu News