: కారులో పోలీసు అధికారి ఎంజాయ్... 1.5 కోట్ల లైక్ లు!


ఆనందాన్ని ఒక్కొకరు ఒక్కో రూపంలో చూపుతారు. తమకు నచ్చిన పాట వినిపిస్తుంటే పెదాలు పదం కలుపుతాయి. చేతులు గాల్లో నాట్యమాడుతాయి. మనసుకు ఇంకా దగ్గరైన పాట అయితే, యూఎస్ డెలావర్ నగరంలో జెఫ్ డేవిస్ లా చేస్తారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే... డేవిస్ పోలీసు శాఖలో ఉన్నతాధికారి. ఈమధ్య ఆయన ఒంటరిగా కారులో ప్రయాణిస్తున్నారు. పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ గొంతు నుంచి జాలు వారిన పాప్ గీతాన్ని వింటూ, ఆలపించుకుంటూ కారును నడుపుతున్నారు. ఆ సమయంలో ఆయన ముఖ కవళికల తీరు, స్వరంలో పలకించిన విన్యాసం తదితరాలు కారులోని వీడియో కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను ఆయన సామాజిక వెబ్ సైట్ లో పెట్టారు. దాన్ని కోట్లమంది చూడగా, దాదాపు 1.5 కోట్ల మంది లైక్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ వీడియోను పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ చూసి తెగ సంబరపడిపోయిందట. వీడియోను షేర్ చేసుకోవాలంటూ అభిమానులకు సూచించింది.

  • Loading...

More Telugu News