: కేజ్రీ... మీ క్రేజీ సవాల్ కు సిద్ధమే!: కిరణ్ బేడీ

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విసిరిన సవాల్ ను కిరణ్ బేడీ స్వీకరించారు. కేజ్రీవాల్ సవాల్ స్వీకరిస్తూ ప్రకటన చేసిన సందర్భంగా కిరణ్ బేడీ నేటి ఉదయం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కేజ్రీవాల్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పడమే కాక ఆయనపై సుతిమెత్తని విమర్శలతో దాడి కూడా చేశారు. ‘‘బీజేపీ అంగీకరిస్తే బహిరంగ చర్చకు నేను సిద్ధమే. అయితే ఇదో విభిన్న అంశం. సేవనే నేను విశ్వసిస్తాను. కేజ్రీవాల్ తో అసెంబ్లీలో చర్చిస్తాను. కేజ్రీవాలేంటో నాకు తెలుసు. కేజ్రీవాల్ ఎలాంటి చర్చకు తెర తీస్తారో కూడా తెలుసు. మీకు ఆయన గురించి తెలియదు. చర్చల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యమిస్తాను. చర్చలకు అసెంబ్లీ ద్వారా సరిపడినంత సమయముంది’’ అని అమె వ్యాఖ్యానించారు. ‘‘నేనో అరాచకవాదినంటూ ప్రకటించిన సందర్భంగా 15 నెలల క్రితమే ఆయనను ఢీకొట్టాను’’ అంటూ కిరణ్ బేడీ అన్నారు. అయితే ఎన్నికల సందర్భంగా బహిరంగ చర్చపై మాత్రం ఆమె స్పష్టమైన ప్రకటన చేయలేదు.

More Telugu News