: భారత్ లో ఐఎస్ఐఎస్ దాడులకు దిగే అవకాశముందంటున్న బ్రిటన్

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు భారత్ లో దాడులకు దిగే అవకాశముందని బ్రిటన్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు భారత్ ను హెచ్చరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో లండన్ లో జరిగిన ఇండో-యూకే కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో బ్రిటన్ అధికారులు ఈ సమాచారాన్ని భారత్ కు తెలిపారు. లష్కర్ ఏ తోయిబా వంటి పాక్ టెర్రర్ గ్రూపులకంటే ఐఎస్ఐఎస్ తోనే అధిక ముప్పు ఉన్నట్టు బ్రిటన్ భావిస్తోందని భారత్ కు చెందిన ఓ అధికారి తెలిపారు.

More Telugu News