: నందిగామ పోలీసుల అదుపులో ఖమ్మం జిల్లా విలేకరులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన విలేకరులను కృష్ణాజిల్లా నందిగామలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో రహదారులపై లారీ డ్రైవర్లను బెదిరిస్తున్నారని, వారినుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి. దాంతో కొంతమందిని అరెస్టుచేసి నందిగామ పోలీసుస్టేషన్ లో డీఎస్పీ విచారిస్తున్నారు.