: కాంగ్రెస్ కు మరో షాక్.... బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణా తీరథ్

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కు కొద్దిసేపటి క్రితం మరో షాక్ తగిలింది. పార్టీ మహిళా నేతల్లో సీనియర్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణా తీరథ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామాతో ఆగని ఆమె బీజేపీలో చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆమె ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కృష్ణా తీరథ్, పార్టీలో కీలక మహిళా నేతగా ఉన్నారు. ఆమె నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లిన కృష్ణా తీరథ్, ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించేదాకా ఈ విషయం అసలు మీడియాకు కూడా తెలియకపోవడం గమనార్హం.

More Telugu News