: కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నుంచి డబ్బులు తీసుకుని తమకే ఓట్లు వేయాలంటూ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దానిపై తీవ్రంగా మండిపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుకు దిగింది. అంతేగాక ఢిల్లీ ప్రజలను అవమానపరచే విధంగా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమని ఢిల్లీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధినేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు.