: ప్రాణాల కోసం పోరాడుతున్న 'మహా' మాజీ హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీలో కీలక నేత ఆర్.ఆర్.పాటిల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాల కోసం పోరాడుతున్నట్టు సమాచారం. గుండెల్లో నొప్పితో, ఊపిరి తీసుకోవడం కష్టంగా వున్న ఆయన్ను 15 రోజుల క్రితం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి అదుపులోకి రాకపోగా, మరింత దిగజారింది. దీంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. పాటిల్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో మహారాష్ట్రకు పాటిల్ డిప్యూటీ సీఎంగా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. పాటిల్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి బులెటిన్ వెలువడాల్సివుంది.