: బీజేపీ అందమంతా మోదీనే... మేము ఆయన చుట్టూ తిరిగే తారలం: కిరణ్ బేడి
ప్రపంచంలో అంత్యంత సుందర మోము బీజేపీతో వుందని, ఆ రూపం ఆకర్షణకు ఎవరైనా తలవంచాల్సిందేనని మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి వ్యాఖ్యానించారు. బీజేపీ అందమంతా ప్రధాని మోదీయేనని, తామంతా ఆయన చుట్టూ తిరిగే తారల వంటి వారమని ఆమె అన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీలో చేరిన ఆమె అమిత్ షాతో కలసి మోదీతో ఢిల్లీ ఎన్నికలపై చర్చలు జరిపారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని ఆమె వివరించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో కిరణ్ ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ యోచిస్తున్న సంగతి తెలిసిందే.