: చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు, ఒక బాలుడి మృత దేహాలను గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన చిన్నారులను వేల్పూరుకు చెందిన పావని, పల్లవి... కడియంకు చెందిన మణికంఠగా గుర్తించారు. మరణించిన ముగ్గురు చిన్నారులూ ఆదివారం నాడు అదృశ్యమయ్యారు. వీరు ముగ్గురూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News