: ఎన్టీఆర్ బతికుంటే టీడీపీ నేతలను వెంటపడి కొట్టేవారు: రఘువీరా

తెలుగుదేశం పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీలో చంద్రబాబు సహా 90 శాతం మంది ఎన్టీఆర్ ద్రోహులేనని అన్నారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమలుకాని పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టి, ఆ మహానుభావుడి పేరును అప్రతిష్ఠ పాలుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆరే గనుక బతికుంటే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతలను వెంటపడి కొట్టేవారని వ్యాఖ్యానించారు.

More Telugu News