: రాజపక్స ఓటమికి కారణం భారత్ 'రా'!
శ్రీలంకలో మహింద రాజపక్స పాలన ముగియడానికి కారణం భారత్ 'రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్' (రా) అని లంక మీడియా బలంగా నమ్ముతోంది. మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్దతు ప్రకటించి, ఆయన గెలుపునకు వెనకుండి మంత్రాంగం నడిపించిందని లంక పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. అందుకు 'రా' తోడ్పడిందని పేర్కొన్నాయి. కాగా, ఈ విషయాన్ని రాజపక్స ముందే గమనించినట్టు తెలుస్తోంది. అందువల్లే కొలంబోలో పనిచేస్తున్న 'రా' స్టేషన్ చీఫ్ ను ఎన్నికలకు ముందు దేశం విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించారట. ఈ విషయంలో అటు లంకగానీ, ఇటు భారత్ గానీ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి.