: నిధులు దుర్వినియోగం అయితే ఖబడ్దార్... పంచాయతీ కార్యదర్శులకు కేటీఆర్ హెచ్చరిక

సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిలో గ్రామ కార్యదర్శుల పాత్రే అత్యంత కీలకమని టీఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవచేయాలని గ్రామ కార్యదర్శులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాదులో తెలంగాణ గ్రామపంచాయతీ కార్యదర్శుల డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ కార్యదర్శుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని... నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News