: రైతు బిడ్డను... సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: మెదక్ జిల్లా ఎస్పీ సుమతి
‘‘నేను రైతు బిడ్డను. సామాన్యుల కష్టాలు నాకు తెలుసు. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా’’ అని మెదక్ జిల్లా ఎస్పీ సుమతి అన్నారు. జిల్లా ఎస్పీగా నియమితులైన ఆమె నిన్న ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రెగ్యులర్ పోలీసు అధికారులకు భిన్నంగా వ్యవహరించారు. జిల్లాలో పోలీసింగ్, నేర చరిత్ర తదితరాలపై దృష్టి సారిస్తామని చెప్పిన ఆమె, అంతటితోనే ఆగకుండా సామాన్యులను ఆకట్టుకునేలా వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేయాలని ఆమె జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.