: తెలంగాణకు హైదరాబాద్ ఆకర్షణ అయితే... ఏపీకి చంద్రబాబు ఆకర్షణ: వెంకయ్యనాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. విశాఖ జిల్లాలో ఐఐఎం శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబును ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేశారు. ఒక వ్యక్తి తనను కలసి... 'సార్, పెట్టుబడులన్నీ హైదరాబాదును చూసే వస్తున్నాయి... హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయింది, ఇప్పుడెలా?' అని అడిగాడని తెలిపారు. దానికి సమాధానంగా... 'తెలంగాణకు హైదరాబాద్ ఆకర్షణ అయితే... ఏపీకి చంద్రబాబు ఆకర్షణ' అని చెప్పానని అన్నారు. ఎలాంటి పెట్టుబడులనైనా ఆకర్షించే సమర్థత చంద్రబాబు సొంతమని చెప్పారు. బాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News