: కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు... కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు

గణతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్న కొద్దీ దేశంలో ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా పాక్ సైన్యం భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడితే, ఇటీవలి కాలంలో దేశంలోకి చొచ్చుకొస్తున్న ఉగ్రవాదులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. కుల్గం జిల్లా రెద్వానీలో భారత భూభాగంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించగా, మరొక పౌరుడికి గాయాలయ్యాయి.

More Telugu News