: అబ్బురపరుస్తున్న మూడేళ్ల బుడతడి అద్భుత జ్ఞాపకశక్తి

ఆ బుడతడు తలలు పండిన మేథావులతో 'ఔరా' అనిపించాడు. మూడేళ్ళ వయసులో ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అమెరికా, న్యూయార్క్ నగరానికి చెందిన మూడేళ్ల భారత సంతతి చిన్నారి ప్రపంచ మ్యాప్‌ను ఔపోసన పట్టేశాడు. మ్యాప్‌లో ఏ దేశం ఎక్కడ ఉందో ఏమాత్రం తడుముకోకుండా చెప్పేస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొంటున్నాడు. హైదరాబాదుకు చెందిన జయశ్రీ, రఘురాం చామల దంపతుల ముద్దుల బిడ్డ విహాన్. ఈ బుడతడు కేవలం 4 నిమిషాల 42 సెకన్ల వ్యవధిలో 196 దేశాలను ప్రపంచ పటంలో గుర్తించేస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఈ చిన్నారి మేథస్సు, జ్ఞాపకశక్తిని చూసి చూపరులు మంత్రముగ్ధులవుతున్నారు.

More Telugu News