: కేజ్రీవాల్ పై కిరణ్ వాలియాను పోటీగా నిలిపిన కాంగ్రెస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ పై కాంగ్రెస్, బీజేపీలు దృష్టి సారించాయి. బలమైన అభ్యర్థులను కేజ్రీపై నిలబెట్టాలనే యోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన నాల్గవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురి పేర్లు ఉన్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై సీనియర్ నాయకురాలు కిరణ్ వాలియాను నిలబెడుతున్నట్టు ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

More Telugu News