: ఆస్కార్ బరిలో నిలవని ఇండియా... బర్డ్ మాన్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ లకు తొమ్మిది నామినేషన్లు
87వ ఆస్కార్ అవార్డుల తుది పోరులో చోటు సంపాదించడంలో భారత్ విఫలమైంది. తొలుత 'ఒరిజినల్ స్కోర్' విభాగంలో నిలిచిన ఏ.ఆర్.రెహమాన్, ఫైనల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలం అయ్యారు. ఉత్తమ చిత్రం విభాగంలో తెలుగు చిత్రం 'మిణుగురులు' సహా జల్, దాగా, కపుస్ కొండయాచి గోష్టా, కొచ్చాడియాన్, యంగిస్తాన్ తదితర సినిమాలు ప్రాథమిక అర్హత సాధించినా, తుది పోరులో నిలవలేకపోయాయి. ఈ దఫా రెండు కామెడీ చిత్రాలు గ్రాండ్ ఫైట్ కు సిద్ధమయ్యాయి. బర్డ్ మాన్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ లు చెరో 9 విభాగాల్లో నామినేషన్లు సాధించాయి. ది ఇమిటేషన్ గేమ్ కు 8, అమెరికన్ స్నిపర్, బాయ్ హుడ్ చిత్రాలకు 6 చొప్పున నామినేషన్లు దక్కాయి.