: తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుకు పిటిషన్... విచారణకు సుప్రీం ఓకే
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన ఇంకా పూర్తే కాలేదు, అప్పుడే తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్ కోసం న్యాయవాదులు కోర్టు మెట్లెక్కారు. న్యాయవాదుల నుంచి అందిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం విచారణకు స్వీకరించింది. న్యాయవాదుల పిటిషన్ పై మీ అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందన రాగానే తెలంగాణ బార్ కౌన్సిల్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.