: తెలుగు సహా ఎనభై భాషలకు మద్దతిచ్చే గూగుల్ 'వాయిస్ ట్రాన్స్ లేటింగ్ యాప్'
చెప్పిన మాటలను మనకు కావాల్సిన భాషలో 'టెక్స్ట్' రూపంలో అందించే అద్భుతమైన యాప్ ను ప్రముఖ సెర్చింజన్ గూగుల్ విడుదల చేయనుంది. గూగుల్ అందించే 'వాయిస్ ట్రాన్స్ లేటింగ్ యాప్'ని లోడ్ చేసుకోవడం ద్వారా మాట్లాడిన దాన్ని మనకు అవసరమైన మరో భాషలోకి తర్జుమా చేసుకోవచ్చు. అంతేకాదు, తర్జుమా చేసిన దాన్ని అదే భాషలో వినొచ్చు కూడా. ప్రస్తుతం ఈ యాప్ 80 ప్రపంచ భాషలకు మద్దతిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక స్థితిలో ఉన్న యాప్ అతి త్వరలో ఆండ్రాయిడ్, ఐఓస్ ఫోన్లకు అందుబాటులోకి రానుంది. అంతర్జాల సదుపాయం లేకపోయినా ఈ యాప్ పనిచేస్తుందని గూగుల్ వివరించింది.